కృష్ణా: నందిగామ పట్టణ పరిధిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల వెంకట్రావు శనివారం పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ విజ్ఞప్తితో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తాను ఈ ప్రాంతం వాడినని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.