NLR: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా కావలి నియోజక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు మంగళవారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీద మస్తాన్ రావును కోవూరు టీడీపీ నేత, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.