ATP: పామిడిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.