GNTR: గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువులో నీళ్ల బకెట్లో పడి 16 నెలల బాలుడు మృతి చెందాడు. బీహార్‌కు చెందిన పఠాన్ యూసఫ్ ఖాన్ కుమారుడు అతీష్ ఖాన్ (16 నెలలు) ఆదివారం ఆడుకుంటూ నీళ్ల బకెట్లో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.