W.G: భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్‌ను శనివారం జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వండి పెట్టే కిచెన్ రూమ్‌ను, పరిసరాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల క్లాస్ రూమ్‌కి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.