CTR: మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎస్సై రమణ పిలుపునిచ్చారు. పుంగనూరు పట్టణంలోని ఇందిరా కూడలిలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. వీటి ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పారు. ఇలాంటి మత్తు పదార్థాలను నియంత్రించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.