ATP: కనేకల్ మండలం బెనికల్ గ్రామ సచివాలయంలో బుధవారం బెనికల్ నీటిపారుదల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎలక్షన్ ఆఫీసర్ ఆర్.భవాని శంకర్ విడుదల చేశారు. అర్హులైన రైతులు ఈనెల 14న జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో బెనికల్ వీఆర్వో ఆదినారాయణ, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.