NDL: ఓర్వకల్లు ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ పిల్లల పాఠశాలకు మంగళవారం తానా ఫౌండేషన్ సహకారంతో రూ. 10 లక్షల సహకారాన్ని నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయ భారతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర రెడ్డి, తానా సభ్యులు రవి, తదితరులు పాల్గొన్నారు.