PLD: దాచేపల్లి నగర పంచాయతీ 8వ వార్డు టీడీపీ నాయకులు గొట్టిముక్కల విజయరాజు పార్టీ మారి శనివారం రాత్రి వైసీపిలో చేరారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమక్షంలో, దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ కొప్పుల సాంబయ్య నాయకత్వంలో నరసరావుపేటలో ఈ చేరిక జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహేష్ రెడ్డి విజయరాజును కోరారు.