NTR: ఎన్టీఆర్ జిల్లా APNGGO ఉపాధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ జానిపాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ బాధ్యతలు ఆయనకు దక్కాయి. జానిపాషా నాయకత్వంలో జిల్లాలో ఉద్యోగ సంఘం మరింత బలోపేతం అవుతుందని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.