AP High Court : రైల్వే జీఎం, డీఆర్ఎంపై ఏపీ హైకోర్టు ఫైర్
విజయవాడ(Vijayawada) మధురానగర్ రైల్వే బ్రిడ్జి పనుల (Railway Bridge Works) ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ (AP High Court Inquiry)చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , డీఆర్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం,(SCR Gm) డీఆర్ఎం (DRM) విచారణకు గైర్హాజరవడమే అందుకు కారణమని తెలుస్తుంది
విజయవాడ(Vijayawada) మధురానగర్ రైల్వే బ్రిడ్జి పనుల (Railway Bridge Works) ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ (AP High Court Inquiry)చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , డీఆర్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం,(SCR Gm) డీఆర్ఎం (DRM) విచారణకు గైర్హాజరవడమే అందుకు కారణమని తెలుస్తుంది. ఈ సందర్భంగా హైకోర్టు (High Court) ధర్మాసనం నుంచి తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. డీఆర్ఎం స్థాయి అధికారిని కూడా విచారణకు రప్పించలేకపోతే హైకోర్టు ఎందుకు? కోర్టులు అంటే అంత లెక్కలేదా? విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి? అంటూ మండిపడింది. అవతల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ హైకోర్టు తీవ్ర (AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ఇక కొందరు అధికారులకు హైకోర్టు శిక్షలు కూడా విధించిన విషయం విదితమే..