GNTR: కోటప్పకొండ తిరునాళ్ల తరువాత చెప్పుకోదగినది వడ్లమూడి క్వారీలోని శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల. సుమారు వందేళ్లకుపైగా ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 80 సంవత్సరాలుగా ఏటా ఇక్కడ తిరునాళ్ల జరుగుతోంది. 1920లో చీమకుర్తి యలమందయ్య గ్రామంలోని తన పొలం దున్నుతుండగా శివలింగం బయటపడిందని చెప్తారు. విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.