కోనసీమ: అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆలమూరుకు చెందిన సీనియర్ నాయకుడు వంటిపల్లి సతీష్ కుమార్‌ను నియమించారు. ఈయన్ను రెండోసారి ఈ పదవిలో నియమించారు. పార్టీ కార్యాలయం నుంచి ఆయన్ను నియమిస్తూ సమాచారం అందించారు. రెండో సారి నియమితులైన సతీష్‌కు గురువారం పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు.