ASR: కొయ్యూరు మండలం పాడి గ్రామంలో బుధవారం ఎంపీపీ రమేష్, ఎంపీడీవో ప్రసాద్ పర్యటించారు. గ్రామంలో పలువురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈని ఆదేశించారు.