GNTR: జనవరి 8న జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈఓ జ్యోతిబసు వివరాలను వెల్లడిస్తూ, ఆ రోజు ఉదయం 9:30 గంటలకు 1, 7వ స్టాండింగ్ కమిటీల భేటీ, అనంతరం 11:30 గంటల నుంచి సర్వసభ్య సమావేశం ఉంటుందని మంగళవారం తెలిపారు. సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.