గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న సంకల్పం-మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం కార్యక్రమం పెదకాకానిలో గురువారం నిర్వహించారు. పెదకాకాని CI నారాయణస్వామి ఉత్తర్వుల మేరకు SI రామకృష్ణ నంబూరు సెంటర్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ చేపట్టారు.