చిత్తూరు: టీడీపీ మంత్రిపై మాజీ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలు హాస్యాస్పదమని టీడీపీ నేత పి.సుబ్బయ్య అన్నారు. ఇందులో భాగంగా ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, ఇప్పుడు జైలుకు వెళ్తున్న వైసీపీ నేతల దుస్థితిని చూసి భూమనకు మతిస్థిమితం తప్పిందని ఆయన ఎద్దేవా చేశారు.