W.G: విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థమైన మానవతా సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్, ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ రాజ్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు, గోల్డ్ మెడల్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందుకున్నారు.