ప్రకాశం: కొమరోలు మండలం గోపాలుని పల్లె గ్రామం MPP పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఉదయగిరి సత్య అనసూర్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. మూలపల్లె గ్రామానికి చెందిన సత్య అనసూర్య 2018 DSC బ్యాచ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. ఐదు సంవత్సరాల సర్వీస్‌లో ఇప్పటివరకు 27 రోజులు మాత్రమే సెలవులు తీసుకుని నిత్యం పాఠశాల విద్యార్థులకు విద్య బోధిస్తోంది.