సత్యసాయి: కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన బండి వినోద్ కుమార్తె బండి రిషికా (9) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. కష్టకాలంలో తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.