సత్యసాయి: పుట్టపర్తిలో జరిగిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” అవార్డుల కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, కలెక్టర్ శ్యాం ప్రసాద్ విజేతలకు అవార్డులు అందజేశారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో కృషి చేసిన వారిని సత్కరించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, చెట్లు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ హిత ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను పరిశీలించారు.