GNTR: అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం తెనాలిని అభివృద్ధి చేస్తామని మున్సిపల్ కమిషనర్ రామ అప్పల నాయుడు తెలిపారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాళ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఆఫీసులోని పలు విభాగాల్లో కొన్ని లోపాలు తన దృష్టికి వచ్చాయని వెల్లడించారు.