కృష్ణా: కాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంటశాల, భోజన నిర్వహణ పరిస్థితులు మౌలిక సదుపాయాలను జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల శుభ్రత, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సరైన పోషకాహారం అందించడం గురించి ఉపాధ్యాయులతో చర్చించారు.