ELR: జిల్లా కలెక్టరేట్ వద్ద స్కూల్ స్వీపర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ.. సానిటేషన్ వర్కర్లు ఐదు నెలలగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.