కృష్ణా: మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం బెంగుళూరు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి బెంగుళూరు ప్రయాణమయ్యారు. కాగా జగన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా వారికి నమస్కరించిన ఆయన బెంగుళూరు పయనమయ్యారు.