కాకినాడ: గడప లోపలే మతం- గడప దాటితే భారతీయులం అంటూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం కాకినాడ కచేరిపేట వెంకటేశ్వరకాలనీ కూడలిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు బేబిరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని తెలిపారు.