NTR: నందిగామ మండల పరిధిలోని పల్లగిరి కొండపై శనివారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. కొండపై పెళ్లికి వెళ్లి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారు వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.