E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పాఠశాలలో శనివారం నిర్వహించిన ‘తేజస్ స్కూల్ కార్నివల్ – 2025’ కార్యక్రమంలో MLC సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఎగ్జిబిట్స్ను ఆయన సందర్శించి, విద్యార్థులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనలు పెంచుతాయన్నారు.