ప్రకాశం: రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు విద్యార్థులకు సూచించారు. పెద్దగొల్లపల్లిలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై ఎస్సై అవగాహన కల్పించారు. స్కూల్కు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహనాలను గమనిస్తూ అప్రమత్తంగా ఇళ్లకు చేరాలని ఎస్సై సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.