SKLM: జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ మందిరంలో సమావేశం జరిగింది. ఆయన సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టారు.