కృష్ణా: కుంభమేళా సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు నం. 67767& 67768 డోర్నకల్, విజయవాడ మధ్య నడిచే రైళ్లు, నెం.67769 & 67770 విజయవాడ- గుంటూరు మధ్య నడిచే రైళ్లను మార్చి 1 నుంచి 7 వరకు రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు.