కృష్ణా: పలాస నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో తండేల్ మూవీ పైరసీని ఆదివారం రాత్రి ప్రదర్శించారు. సినిమా విడుదలైన మూడు రోజులకే ఇలా ప్రదర్శించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పైరసీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు. తండేల్ మూవీ హిట్ టాక్తో బాక్సీఫీస్ వద్ద వసూళ్ల సృష్టిస్తున్న విషయం తెలిసిందే.