అన్నమయ్య: చలనచిత్ర పరిశ్రమకు ఘంటసాల ఎనలేని సేవలు అందించినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. గురువారం పరవాడ సంతబయల వద్ద జరిగిన ఘంటసాల జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటశాల విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ఆలపించిన గేయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. ఘంటసాల కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు.