VZM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి టివి రాజేష్ కుమార్, 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.