AKP: గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంకు చెందిన మరిశా కృష్ణారావు శుక్రవారం రాత్రి భోజనం చేసి మేడ మీద పడుకోగా శనివారం ఉదయం కిందకు వచ్చే క్రమంలో కాలు జారి మేడ మీద నుంచి పడిపోవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.