TPT: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు కేటాయించి అమలపరిచిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నూతనంగా గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాన్ని గూడూరు పట్టణం దూడల కాలువసెంటర్లో ఆర్భాటంగా ప్రారంభించారు.