ASR: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు సివిల్స్ ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో అభిషేక్ గౌడ బుధవారం పాడేరులో తెలిపారు. 100మంది గిరిజన యువతకు వేపగుంట యూత్ శిక్షణా కేంద్రంలో శిక్షణ అందిస్తామన్నారు. ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు పంపిణీ చేసి, స్వీకరిస్తామన్నారు.