ELR: నూజివీడు మండలం అన్నవరంలో బాణాసంచా తయారీ & నిల్వ కేంద్రాలపై పోలీసుల గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుడు పదార్థాల నిల్వ సమయంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతి లేకుండా తయారీ, విక్రయం చేస్తే Explosives Act ప్రకారం చర్యలు తప్పవన్నారు.