NTR: గంపలగూడెం మండలంలో గంపలగూడెం, ఉటుకూరు, నెమలి, తునికిపాడు, వినగడప, రాజవరం తదితర గ్రామాల్లో శనివారం ఉదయం సామాజిక పింఛన్ పంపిణీ ప్రారంభించారు. పెనుగొలనులో సచివాలయ, పంచాయతీ, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ నగదును అందజేశారు. ఇంటింటికీ వచ్చి 1వ తేది పెన్షన్లు ఇవ్వటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.