ATP: కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఆటో స్వయంగా నడిపి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.