VZM: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, KGBVల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూడాలి. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు.