GNTR: ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేష్ కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిశారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాకేష్ మృతి చెందడం నన్ను కలచి వేసిందని లోకేష్ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, ఏనుగుల దాడిచేయడంతో ఆయన మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.