ELR: పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో సీఐ సీహెచ్.రాజశేఖర్ నేతృత్వంలో గురువారం పోలీసులు అకస్మాత్తుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడుల్లో 10 మంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.91,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. పేకాట కోడిపందాలు, మద్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలు జీవితానికి హాని కలిగిస్తాయన్నారు.