ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు శనివారం జారీ చేశారు. గత కొంతకాలంగా పాఠశాల విద్యార్థులు ఎదుట దైవ దూషణ చేయడం, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఎంఈఓ రాముడు డీఈఓకు అందజేశారు. అనంతరం విచారణ జరిపి షోకాజ్ ఇచ్చినట్లు తెలిపారు.