ఉమ్మడి విశాఖ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఏజెన్సీ తరహాలోనే దట్టమైన మంచు కురుస్తోంది. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాయంత్రం 4 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండగా.. అర్ధరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకూ మంచు మరింత దట్టంగా కురుస్తోంది.