VZM: దేశ సరిహద్దులలో భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గురువారం రాత్రి స్దానిక ఒకటవ పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ను పోలీసులు జల్లెడ పట్టారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు.