కృష్ణా: కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిండా ముంచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు అన్నారు. మంగళవారం విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో భాదుడు మొదలుపెట్టిందని విమర్శించారు.