ప్రకాశం: మర్రిపూడి మండలం సంగమేశ్వరం నుంచి వచ్చే త్రాగునీరు గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో పది గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈస్కీమ్ దర్శికి చెందిన ఓ వ్యక్తి టెండర్ దక్కించుకోగా లీజు కింద మరో యువకుడికి అప్పగించాడు. గత 14 నెలలుగా తనకు బిల్లులు రాలేదని స్కీమును నడపకుండా ఆపివేశాడు. దీంతో మంచి నీరు లేక 10 గ్రామాల ప్రజలు దాహంతో కేకలు పెడుతున్నారు.