NLR: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. శనివారం పలువురు మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.