AKP: నర్సీపట్నం డివిజన్లో రైతులు వరి పంట కోతలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీదేవి తెలిపారు. డివిజన్ పరిధిలో 5 మండలాల్లో 11962 హెక్టార్లలో రైతులు వరి పంట సాగు చేస్తున్నారన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు నాలుగు రోజులు పాటు వరి కోతలు చేపట్టవద్దన్నారు. పొలంలో నీరు ఉండకుండా బయటకు వెళ్లిపోయే విధంగా చూసుకోవాలన్నారు.